విశాఖ: విశాఖ జిల్లా పెద బయలు మండలం , బురద మామిడి గ్రామం వద్ద శుక్రవారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో మావోయిస్టులకు, సీఆర్పీఎఫ్ బలగాలకు మధ్య జరిగిన ‘ఎదురు కాల్పు’ల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారని అధికారులు తెలిపారు. గాయపడిన కానిస్టేబుల్ ఒకరిని చికిత్స కోసం విశాఖ పట్టణానికి తరలించారు. సంఘటనా స్థలిలో రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సుమారు ఇరవై మంది మావోయిస్టులు తమపై కాల్పులు జరపడంతో ఆత్మరక్షణార్థం ఎదురు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. మరో వైపు స్థానిక గిరిజనులు మాత్రం సిఆర్‌పిఎఫ్ బలగాలే ఇద్దరు గ్రామస్థుల్ని కాల్చి చంపారని ఆరోపించారు. మృత దేహాలను తీసుకెళ్లేందుకు వచ్చిన పాడేరు పోలీసు లను స్థానికులు చుట్టు ముట్టారు.