హోసూరు యమాహా షోరూంలో ఏర్పడిన అగ్నిప్రమాధామం వల్ల లక్షల విలువ చేసే ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.హోసూరు యమాహా షారూమ్లో సోమవారం రాత్రి సిబ్బంది విధులు ముగించి కార్యాల యానికి తాళం వేసి ఇళ్లకు వెళ్లారు.కొద్దిసేపటి కి షారూమ్లో పొగలు బయటకు రావడం చూసిన స్థానికులు హోసూరు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యమాహా షోరూమ్ నిర్వాహకులకు సమాచారమందించడమే కాక అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు.సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది షోరూమ్ తలుపులు తెరిచి మంటలపై నీరు చెల్లి అదుపు చేశారు.షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన అగ్నిప్రమాదం వల్ల షోరూమ్ లో నిలిపియుంచిన 15 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.ఈ సంఘటనపై హోసూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

యమహా షో రూమ్