జమ్మూ: పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం పాక్ సైనికులు భారత సైనికులపై కాల్పులకు దిగారు. సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు మోర్టార్లతో కాల్పులు చేసారు. భారత సైనికులు తిరిగి ఎదురుకాల్పులు జరపడంతో పాక్ సైనికులు వెనుదిరాగారు. సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.