విశాఖ: నగరంలో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ప్రయాణికులతో కూర్మన్నపాలెం నుంచి విజయనగరానికి వెళ్తుండగా నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని శాంతిపురం వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ముందుగా పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. ప్రయాణికులందర్నీ దించేశారు. మంటలు వ్యాపించి అందరూ చూస్తుండగానే బస్సు కాలిపోయింది. పెట్రోల్ బంక్ పక్కనే ఉండటంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రయాణికులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదు: ప్రయాణికులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదు ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు తెలిపారు. బస్సు సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తం చేశారని, ప్రమాదంపై విచారణ చేయిస్తున్నామని అన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రమాదస్థలికి చేరుకుని పరిశీలించారు.