శ్రీనగర్ : నౌషెరా సెక్టారు నియంత్రణ రేఖ వద్ద భద్రతా బలగాలు మంగళవారం రాత్రి జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. మరో పాక్ ఉగ్రవాది తీవ్రంగా గాయపడ్డాడు. కొందరు పాక్ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడేందుకు యత్నించినపుడు భారత జవాన్లు కాల్పులు జరిపారు. హతమైన ఉగ్రవాదుల మృత దేహాల కోసం జవాన్లు గాలిస్తున్నారు. ఆ మృతదేహాలను వారి సహచరులే తీసుకువెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. భారత సైనికులు సరిహద్దుల్లో మోహరించారు.