దిగజారిన మోదీ ప్రతిష్ట

దిగజారిన మోదీ ప్రతిష్ట

లండన్ : కరోనా నివారణ చర్యల్లో దారుణంగా విఫలమైనందున ప్రధాని మోదీ ప్రతిష్ట బాగా దిగజారిందని ఇక్కడి ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది. కరోనా రెండో దశ గురించి ముందుగానే నిపుణులు హెచ్చరించినా పట్టించుకోకుండా తమ బాధలు, ఇబ్బందుల పట్ల మోదీ ఉదాసీనంగా వ్యవహరిస్తు న్నారని అత్యధిక ప్రజలు భావనగా పేర్కొంది. గురువారం ప్రచురించిన 2,300 పదాల కథనంలో కరోనా ను ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొనలేకపోయిందని మోదీని ఉద్దేశించి విదేశీ ప్రచార మాధ్యమాల్లో వస్తున్న విమర్శలను ప్రతిఘటిం చడాన్నీ కేంద్రం విరమించినట్లు కనిపిస్తోంది. బిజెపి ఎన్నికల కుయుక్తులన్నింటినీ ఎదుర్కొని గెలిచిన మమతా బెనర్జీ విజయం పట్ల ప్రాంతీయ పార్టీలన్నీ ఉత్సాహంగా వున్నాయని పేర్కొంది. ఢిల్లీలో సకాలంలో చికిత్సనందించలేక తమ 67 ఏళ్ల తండ్రిని కోల్పోయా మని అనర్య(30) ఆవేదననూ ఆమె మాటల్లోనే వెల్లడించింది. బాధతో, ఆక్రోశంతో, ఆవేదనతో కొన్ని వేల గొంతుకలు ఇలాగే ప్రశ్నిస్తున్నాయి. ప్రియతములకు వైద్యం చేయించడం కోసం యుద్ధాలే చేయాల్సి వస్తోంది. ”మోడీ ఇప్పుడు మసకబారిన నేత. స్వాతంత్య్రం తర్వాత కాలంలో దేశం ఇంతటి విపత్తును ఎన్నడూ ఎదుర్కొనలేదు. ఈ పరిస్థితులను చూస్తూ కూర్చున్నారు. ఉద్యోగాలు సృష్టిస్తామని, ఆర్థికాభివృద్ధి పెంచుతామని, ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్టను పెంచుతామని చేసిన హామీలన్నీ నీరుగారిపోయాయి.’కరోనా మహమ్మారిని మోడీ ఎదుర్కొన్న తీరుకు కఠిన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనా ముప్పు తొలగినట్లేనని సూచించేలా ప్రజలకు సందేశాన్ని పంపడాన్నీ ప్రశ్నిస్తున్నారు. తీవ్రంగా టీకాల కొరత నెలకొంది. మార్చి చివరి నుంచి మోదీ పేరు ప్రతిష్టలు దిగజారడం ప్రారంభించాయి. ఆనాడు ప్రజల ఆమోదం రేటు 74శాతం. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. వచ్చేఏడాది జరగనున్న యుపి అసెంబ్లీ ఎన్నికలు మోదీ పని తీరుకు ఒక పరీక్షని పేర్కొంది. చాలా పరిస్థితులు, విషయాలు మారతాయి, కొన్ని సమస్యలు అలాగే కొనసాగుతాయని చివరిలో వ్యాఖ్యానించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos