లక్నో : నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా శనివారం కాశ్మీర్ సింగ్ (75) అనే రైతు శౌచాలయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘాజిపూర్ సరిహద్దు వద్ద గత కొన్ని రోజులుగా సాగుతున్న నిరసనల్లో మృతుడూ పాల్గొన్నాడు. అతణ్ని ఉత్తర ప్రదేశ్ రాంపూర్ నివాసిగా గుర్తించారు. రైతుల పట్ల కేంద్రం చాలా దారుణంగా వ్యవహరించిందని కాశ్మీర్ సింగ్ ఆత్మహత్య పత్రంలో పేర్కొన్నాడు. రైతు నిరసనలు చేస్తున్న స్థలంలోనే తన అంత్యక్రియలు చేయాలని కోరాడు. గతంలోనూ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. డిసెంబర్లో హర్యానాకు చెందిన పూజారి ఒకరు ఢిల్లీ సింఘు సరిహద్దు సమీపంలో ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనం కలిగించింది.