న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని రూ.3 నుంచి రూ.5 లక్షలకు పెంచింది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈమేరకు ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని 1998లో ప్రారంభించారు. ఈ కార్డుల ద్వారా ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల కొనుగోలు, కూలీల ఖర్చు, పంట కోత ఖర్చులు వంటి అవసరాల కోసం లోన్ తీసుకోవచ్చు. బీమా సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ కార్డులను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పొందవచ్చు.