ముంబై: ఎట్టకేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేసారు. అంతకు ముందు ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా ఇదే పని చేసారు. బుధవారం విశ్వాస పరీక్షను ఎదిరించాలని ఫడ్ణ వీస్ను అత్యున్నత న్యాయ స్థానం ఆదేశించింది. గెలుపు పై భరోసా లేక పోవటంతో పదవిని త్యజించారు. ఆది వారం పొద్దున్న ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన ఆయన మంగళవారం సాయంత్రానికి గద్దె దిగారు. భాజపా అవకాశవాద రాజకీయాలకు ఇది గొడ్డలి పెట్టు. మైనారిటీని ఆపరేషన్ కమల ద్వారా మెజారిటీకి మార్చి రాజ్యాధికారాన్ని ఇది వరకూ వివిధ రాష్ట్రాల్లో చేప ట్టిన భాజపా నేత అమిత్ షాకు గట్టి దెబ్బతగిలింది.