లాటరీ పేరిట మరో మోసం

  • In Crime
  • October 10, 2019
  • 200 Views
లాటరీ పేరిట మరో మోసం

నిజామాబాద్ : కొందరు మోసం చేయడానికి బతుకుతుంటే, మరికొందరు మోసపోవడానికే బతుకుతుంటారు. మీరు లాటరీ టికెట్టు కొనుగోలు చేయకపోయినా, మీ గురించి అవతలి వ్యక్తికి తెలియకపోయినా, మీకేదో భారీ ప్రైజ్ వచ్చేసిందని చెప్పగానే నమ్మేస్తుంటాం. మోసపోతూ ఉంటాం. లాటరీలో రూ.3 కోట్ల నగదు బహుమతి వచ్చిందంటూ ఓ విద్యార్థిని మోసం చేసి, అతని వద్ద నుంచి భారీగా సొమ్ము దోచుకున్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలానికి చెందిన గంగారెడ్డి ఇక్కడి ఓ కళాశాలలో హోటల్ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తూ కాచీగూడలో నివాసం ఉంటున్నాడు. ఒక రోజు గంగారెడ్డికి కోకో కోలా కంపెనీ లాటరీలో రూ.3 కోట్ల నగదు వచ్చిందంటూ మెయిల్ వచ్చింది. దీంతో గంగారెడ్డి తన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంపించాడు. రెండు రోజుల తర్వాత డాక్టర్ నికోలస్ పేరుతో గంగారెడ్డికి ఫోన్ వచ్చింది. రూ.23 వేలు జమ చేస్తే రూ.3 కోట్ల చెక్కు పంపిస్తామని చెప్పగానే అతను వెనకా ముందూ ఆలోచించకుండా ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు పంపాడు. ఇలా 5 నెలలుగా సుమారు రూ.43.22 లక్షలను పంపించాడు. తన తండ్రిని నమ్మించి నాలుగెకరాల భూమిని తాకట్టు పెట్టి మరీ డబ్బు పంపించాడు. తండ్రికి అనుమానం వచ్చి కంపెనీ వారికి ఫోన్ చేయమని చెప్పాడు. గంగారెడ్డి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos