ముంబై: ఎన్సీపీ అధిష్ఠానాన్ని ధిక్కరించిన అజిత్ పవార్ ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ శనివారం ఇక్కడ ప్రకటించారు. భాజపాకు మద్దతు ఇవ్వడం అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయమన్నారు. ‘మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మాకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలూ అండనిచ్చారు. అజిత్ నీతిమాలిన చర్యకు పాల్పడ్డారు. ఆయన నిర్ణయం నన్ను తీవ్రంగా కలిచివేసింద’న్నారు.