రాయపాటి కూడా బీజేపీలోకి!

రాయపాటి కూడా బీజేపీలోకి!

 ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించిన బీజేపీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలోకి చేరే వలస నేతల కోసం తలుపులు తెరిచిన విషయం తెలిసిందే.ఇప్పటికే బీజేపీకి ఇంటికి చేరుకున్న నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీ నేతలతో కలసి మరింత మంది తెదేపా నేతలను బీజేపీలో చేర్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.అందులో భాగంగా గుంటూరు జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న రాయపాటి సాంబశివరావును బీజేపీలో చేర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.కొద్ది రోజుల క్రితం బీజేపీ నేత రాం మాధవ్‌ గుంటూరులోని రాయపాటి ఇంటికి వెళ్లి మరీ బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.ఒకవేళ రాయపాటి బీజేపీలో చేరితే జిల్లా వ్యాప్తంగా ఉన్న రాయపాటి అనుచరులు బీజేపీలో చేరతారు.దీంతో రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాల్లో ఒకటైన గుంటూరు జిల్లా తమ వశమవుతుందని బీజేపీ భావిస్తోంది.రాం మాధవ్ ఇచ్చిన ఆఫర్ పై రాయపాటి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఢిల్లీ వచ్చి పార్టీ పెద్దలను కలుస్తానని రాయపాటి చెప్పినట్లు తెలుస్తోందిఅయితే.. రాం మాధవ్ తో భేటీ తర్వాతి రోజే.. రాయపాటి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తనకున్న ఇబ్బందులను  చంద్రబాబుకి వివరించినట్లు సమాచారం. ఢిల్లీలో తాను నివాసం ఉంటున్న ఇంటి వ్యవహారంతోపాటు.. పలు సమస్యలను విన్నవించుకున్నట్లు తెలుస్తోంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos