చిత్తూరును తమిళనాడులో కలపాలట..

చిత్తూరును తమిళనాడులో కలపాలట..

రాజధాని మార్పు నిర్ణయంతో అమరావతి ప్రజలు కొద్ది రోజులుగా నిరసనలతో హోరెత్తిస్తుండగా తెలుగుదేశం, జనసేన,బీజేపీ నేతలు అందుకు మద్దతుగా నిరసనల్లో పాల్గొంటున్నారు.నిరసనల్లో భాగంగా ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో కొంతమంది తెదేపా నేతలు కొన్ని చిత్రవిచిత్రమైన డిమాండ్లు చేస్తున్నారు. తాజాగా సీమకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ చిత్తూరు జిల్లాను తమిళనాడులో కలపాలని కోరారు. రాజధాని అమరావతి మార్పు విశాఖ లో ఏర్పాటు నిర్ణయం సరైందని కాదని మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల సామాన్యులకు ఇబ్బందులు వస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలికానీ పాలనా వికేంద్రీకరణ కాదన్నారు. ఒకవేళ మార్చాలి అనుకుంటే అన్ని సౌకర్యాలున్న తిరుపతిని రాజధాని చేయండని అమర్నాథ్ రెడ్డి కోరారు. లేదంటే తమ చిత్తూరు జిల్లాను తమిళనాడులో లేదా కర్ణాటకలో కలపాలని డిమాండ్ చేశారు.రాజధానిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే మరో నగరానికి తరలిస్తామంటేనే నిరసనలు చేస్తున్న ఈ నేత ఏకంగా జిల్లాను మరో రాష్ట్రం కలపాలంటూ డిమాండ్‌ చేయడమేంటో అతడికే అర్థం కావాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos