బాబు నివాసానికి తొలగింపు తాఖీదులు

బాబు నివాసానికి తొలగింపు తాఖీదులు

అమరావతి: ఉండవల్లిలోని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా అక్రమ కట్టడంగా తేలటంతో దాన్ని ఖాళీ చేసి భవనాన్ని పడగొట్టాలని లేని పక్షంలో ప్రభుత్వమే ఆ పని చేస్తుందని సీఆర్డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి శుక్రవారం తాఖీదులు జారీ చేసారు. దీనిపై వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలనీ దేశించారు. ఆ మేరకు రాసిన కాగితాల్ని ఇంటి తలుపునకు అతికించారు. శుక్రవారం ఉదయం నుంచి కరకట్టపై అక్రమంగా భనాలు నిర్మించిన వారికి ఇదే తరహా తాఖీదుల్ని జారీ చేసారు. కృష్ణానది పరివాహక ప్రాంతం, కరకట్టకు మధ్యలో వెలసిన అనేక అక్రమ కట్టడాల్ని ఎప్పుడు నిర్మించారు? ఎన్నిరోజులు అనుమతి ఉంది? కోర్టు పరిధిలో వివాదాలు ఉన్నాయా? అనే అంశాల గురించి నిశితంగా  చర్చించిన తర్వాత తాఖీదుల జారీ మొదలైంది. మొత్తం 50 కట్టడాలు అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ‘వీళ్ల ఆత్రుత  చూస్తా ఉంటే చంద్ర బాబు నాయుడి మీద ఎట్లా కక్ష తీర్చుకోవాలన్న ఆలోచనలోనే వీరు ఉన్నారనిపిస్తోంద’ని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో న్యాయ పరమైన అంశాలను పరిశీలించ లేదని తప్పుబట్టారు. లింగమనేని అతిథి గృహాన్ని గ్రామ పంచాయతీ అనుమతితోనే కట్టారని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అక్రమ కట్టడాలను కూల్చేయాలని న్యాయ స్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. దానిపై ఇంకా తీర్పు రావాల్సి ఉంది. ఇలా కోర్టులో వ్యాజ్యం ఉన్నప్పుడు భవనాల కూల్చివేతకు తాఖీదులు ఎలా ఇస్తారు? లింగమనేని బిల్డింగ్ కట్టినప్పుడు సీఆర్డీఏనే లేదు’ అని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos