అమరావతి :తాము అధికారాన్ని చేపట్టిన తర్వాత తగిన ప్రతీకారాన్ని తీర్చుకుంటామని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. గురువారం మహానాడు రెండో రోజు కార్యక్రమంలో ప్రసంగించారు. ‘న్టీఆర్ వ్యక్తి కాదు వ్యవస్థ. ఆయన ర్ జీవితం ఆదర్శనీయం. సేవకు నిలువెత్తు రూపం. దేశ వ్యాప్తంగా కష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి. తెలుగు దేశం ఎవరికీ భయ పడదు. సవాళ్లు కొత్త కాదు. తెలుగుదేశాన్ని ఎవరూ కదిలించలేరు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడుతున్నారు. కార్యకర్తలే పార్టీకి శక్తి. వైకాపా బెదిరింపులకు ఎవరూ భయపడరు హత్యా రాజకీయాలు మాకు అలవాటు లేదు. డాక్టర్ సుధాకర్ విషయంలో వైకాపా తీరు దుర్మార్గం. పోలీస్ వ్యవస్థ ఇప్పటికైనా మారాలి. తప్పుడు పనులకు సహకరిస్తున్న పోలీసులనే అంటున్నా. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు. నేను శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకున్నా. ప్రతిపక్షంలో ఉన్నా. మేము అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎంత సేపు? రాజకీయాలు తమాషా కాదు. అరాచకాలు చేస్తే ఆటలు సాగవు. జగన్ దయాదాక్షిణ్యాల మీద మా పార్టీ పనిచేయాలా? చాలా మంది డిజిపిలను చూసా. ఈ తరహా డిజిపిని చూడలేద’ని జగన్ పాలనపై నిప్పులు చెరిగారు.