కరోనా రెండో దశ విజృంభణ : ఐరోపా విల విల

కరోనా రెండో దశ విజృంభణ : ఐరోపా విల విల

లండన్ : ‘ఇంగ్లండ్లో కరోనా వైరస్ మహమ్మారి రెండో దశ విజంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం రోజుకు లక్ష కేసులు కొత్తగా నమోదవుతుండగా, ప్రతి తొమ్మిది రోజులకు ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన వచ్చే వారానికి రోజుకు రెండు లక్షల చొప్పున కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. రెండో దశలో కరోనా వైరస్ బారిన పడి కనీసం 85 వేల మంది మరణించే అవకాశం ఉంది. రెండో దశ కరోనాను కట్టడి చేయడం కోసం మొదటి దశకన్నా పకడ్బందీగా ‘లాక్డౌన్’ ఆంక్షలను అమలు చేయాల్సి ఉంది’ అంటూ కరోనా విజృంభణపై నియమించిన సేజ్ కమిటీ గత రాత్రి ఇంగ్లండ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. లండన్లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులతో కూడిన సేజ్ కమిటీ అక్టోబర్ 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా మహమ్మారి రెండో దశ విజంభణ ప్రారంభమైనట్లు తేలింది. మరో దఫా ‘లాక్డౌన్ ’గానీ, ఆంక్షలనుగానీ విధించాలని దేశ ప్రధాని బోరిస్ జాన్సన్పై శాస్త్రవేత్తల ఒత్తిడి పెరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల చివరి నాటికి మతుల సంఖ్య కూడా గణనీయంగా పెరగుతుందని, రోజుకు 800 మంది చొప్పున మరణించే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. కరోనా వైరస్ మొదటి దశ విజంభణలో దాదాపు 40 వేల మంది మరణించారు. రెండు దశలో దాదాపు 85 వేల మంది మరణించే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేశారు. అంటే, రెండింతలకుపైగా. దేశ వ్యాప్తంగా 86 వేల మంది శాంపిల్స్ను పరిశీలించడం ద్వారా వైరస్ రెండో దశ కొనసాగుతున్నట్లు వారు నిర్ధారణకు వచ్చారు.
ఫ్రాన్స్లో లాక్డౌన్
పారిస్: మహమ్మారి కరోనా అత్యంత ప్రభావిత దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్లో మరోసారి లాక్డౌన్ విధించారు. కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు డిసెంబరు 1 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ప్రకటించారు. దేశంలో వైరస్ వేగంగా విస్తరిస్తోందని, పరిస్థితులు చేయి దాటిపోయే పరిస్థితి కనిపిస్తోందని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘యూరప్లోని ఇతర దేశాల మాదిరిగానే ఫ్రాన్స్లో కూడా సెకండ్ వేవ్ మొదలైంది. మొదటి దశ కంటే ఇది మరింత తీవ్రంగా ఉండవచ్చు. ఇప్పటికే, కరోనా సోకి తీవ్ర అస్వస్థతకు గురైన 3 వేల మందికి పైగా పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించేందుకు ఆస్పత్రుల్లో బెడ్లు అందుబాటులో లేవు. నవంబరు 15 నాటికి సుమారు 9 వేల మందికి ఐసీయూలో చేర్పించి చికిత్స అందించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికైనా మనం జాగ్రత్త పడకపోతే సమీప కాలంలో 4 లక్షలకు పైగా అదనపు మరణాలు నమోదయ్యే అవకాశం ఉంది’’ అని హెచ్చరించారు. రాజధాని నగరం పారిస్ సహా ఇతర ప్రధాన పట్టణాల్లో రెండువారాల క్రితమే కర్ప్యూ విధించినా కరోనా కేసుల(సెకండ్వేవ్)ను కట్టడి చేయలేకపోయామని, సెకండ్వేవ్లో ఇప్పటికే దేశంలో 35 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos