అమరావతి: ఈఎస్ఐలో రూ.136 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చింది. గత ఆరేళ్ల వ్యవధిలో కాగితాలకే పరిమితమైన కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు చేసి అవినీతికి పాల్పడ్డారు. రూ.51 కోట్లు అక్రమంగా చేతులు మారినట్లు అంచనా. ఇందుకు ఈఎస్ఐ డైరెక్టర్లు రవికుమార్, రమేష్, విజయ బాధ్యులుగా గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధర కంటే 136 శాతం అధికంగా టెండర్లలో సంస్థలు చూపించాయి. లెజెండ్ ఎంటర్ప్రైజెస్, ఓమ్మిమేడి ఎన్వెంటర్ ఫెర్ఫామెన్స్ సంస్థలకు అక్రమంగా 85 కోట్ల రూపాయిలను డైరెక్టర్లు చెల్లించారు. ఇందుకు ఈఎస్ఐ డైరెక్టర్లకు తోడుగా ఆరు గురు సంయుక్త సంచాలకులు నిలిచారని తేలింది. అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. శుక్రవారం ఇక్కడ విలే ఖరులతో మాట్లాడారు.‘చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుంది. వారి హయాంలోనే ఈఎస్ఐలో అవినీతి జరిగింది. అక్రతమాలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశించాం. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి ఆయన రాసిన లేఖ సాక్ష్యం.విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్మును తిరిగి వసూలు చేస్తాం.ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం. కేవలం మూడు సంస్థలతో కుమ్మక్కై దోపిడీ చేసారు. మందుల ధరలను భారీగా పెంచేసారని మండి పడ్డారు.