బుల్లితెర ధారావాహికల్లో నటించే నటిపై పిచ్చి ప్రేమను పెంచుకున్న ఓ యువకుడు చేసిన రచ్చకు నటి బెంబేలెత్తిపోయింది.ఆమె ఇంటికెళ్లి తనను పెళ్లి చేసుకోవాలంటూ యువకుడు చేసిన హంగామాతో నటితో పాటు తల్లితండ్రులు కూడా హతాశులయ్యారు.వివరాల్లోకి వెళితే తమిళలో రాజారాణి అనే ధారావాహికలో నటిస్తున్న రితికా అనే నటిపై ఉద్యోగం కోసం చెన్నైకి వచ్చిన భరత్ అనే యువకుడు అభిమానం పెంచుకున్నాడు. ధారావాహికలతో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా రితికా పాపులర్ కావడంతో రితికా అభిమానం రోజురోజుకు ముదిరి ప్రేమ అటుపై పిచ్చిగా మారింది.దీంతో చెన్నైలోని వడపళనిలో రితికా ఇంటికి వెళ్లిన భరత్ రితికాను తనకిచ్చి పెళ్లి చేయాలంటూ రితిక తండ్రి సుబ్రమణితో గొడవకు దిగాడు.అందుకు సుబ్రమణి నిరాకరించగా యువకుడు బెదిరింపులకు పాల్పడడంతో పక్క అపార్ట్మెంట్స్ లో ఉన్నవారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడకి చేరుకొని ఆ యువకుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.గురువారం సొంతూరు వెళ్లడానికి అన్నీ సిద్ధం చేసుకొని రితికా ఇంటికి వచ్చి గొడవ చేశాడని పోలీసులు తెలిపారు. తనకు రితికా అంటే ఇష్టమని, ఆమెని పెళ్లి చేసుకుంటానని విచారణలో చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు..