నలుగురు ఉగ్రవాదులు హతం

పుల్వామా : జమ్మూకశ్మీర్ , లస్సీపోరా లో సోమవారం తెల్లవారు జామున జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన నలుగురు ఉగ్రవాదులు హత మయ్యారు. ఉగ్రవాద దాడి జరిగిన పుల్వామాలోని లస్సీపోరా ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భారత భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపారు. ప్రతిగా మన సైనికులు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. అనంతరం నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల మృతదేహాలు కనిపించాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. సంఘటనా స్థలిలో రెండు ఏకే రైఫిల్స్‌, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌, ఒక తుపాకీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos