రాజ‌కీయ పార్టీ పెట్ట‌నున్న ఎలాన్ మ‌స్క్..?

రాజ‌కీయ పార్టీ పెట్ట‌నున్న ఎలాన్ మ‌స్క్..?

వాషింగ్టన్‌: యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్- ఎలాన్ మ‌స్క్ ల‌ మ‌ధ్య‌ అభిప్రాయ భేదాల‌తో వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. ట్రంప్ ప్ర‌భుత్వం నుంచి వైదొలిగిన త‌ర్వాత..ఎక్స్ వేదిక‌గా ఆ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా రాజ‌కీయా పార్టీ స్థాపించడానికి ప్ర‌పంచ కుబేరుడు, టెక్ దిగ్గ‌జం మ‌స్క్ ఆస‌క్తి చూపుత‌న్నారు. అందుకు అనుగుణంగా సోష‌ల్ మీడియా ‘ఎక్స్‌’లో యూఎస్‌లో కొత్త రాజకీయ పార్టీ కోసం పిలుపునిచ్చారు. అగ్రరాజ్యంలో కొత్త పార్టీకి సమయం ఆసన్నమయ్యిందా? అని మస్క్‌ ‘ఎక్స్‌’ యూజర్లను అడిగారు. దీనికి వచ్చిన ఆసక్తికర ఫలితాలను తాజాగా ఆయన వెల్లడించారు.అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు 80 శాతం మంది యూజర్లు మద్దతు పలికారు. ఈ ఫలితాల వెల్లడి తరువాత మస్క్‌ తన రాజకీయ పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ అని పేరు పెడుతున్నట్లు తెలిపారు. ‘ఎక్స్‌’లో వైరల్‌ అవుతున్న ఈ పోస్టులో మస్క్‌.. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని, 80 శాతం ప్రజలు దీనికి మద్దతు పలుకుతున్నారని తెలిపారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos