పూణె: మహారాష్ట్రలోని పూణెలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. బావధాన్ ప్రాంతంలో ముంబైకి హెలికాప్టర్ లో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభందించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులను గిరీష్‌కుమార్ పిళ్లై, ప్రీతమ్‌చంద్ భరద్వాజ్, పరమజీత్లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. స్థానికుల వివరాల మేరకు… ఛాపర్ టేకాఫ్ అయినప్పుడు పొగమంచు వచ్చిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఉదయం 7 గంటలకు ముందు ప్రమాదం జరిగి ఉండవచ్చునని, విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళంతోపాటు పోలీసు బృందాలు స్పందించాయని అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు మూడు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్ ప్రభుత్వానికి చెందినదా లేక ప్రైవేట్ సంస్థకు చెందినదా అనేది అస్పష్టంగా ఉంది. “పుణె జిల్లాలోని బవ్ధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ముగ్గురు వ్యక్తులు చనిపోయినట్లు సమాచారం. సంఘటన సమయంలో మంటల్లో చిక్కుకున్నందున హెలికాప్టర్ గుర్తింపు ఇంకా పెండింగ్‌లో ఉంది” అని పూణేకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వార్తా సంస్థ పిటిఐ నివేదిక ప్రకారం తెలిపారు.