డెహ్రాడూన్ : అడవుల్లో గజరాజు.. జనావాసాల్లో ప్రత్యక్షమైంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఏనుగు హల్చల్ చేసింది. అక్కడున్న కోర్టు గేట్లను తోసేసి, ప్రాంగణంలోకి ప్రవేశించింది. ఇక ఏనుగు కోర్టు లోపలికి వచ్చేందుకు యత్నించగా, అక్కడున్న కోర్టు సిబ్బంది, లాయర్లు ఆందోళనకు గురయ్యారు. ఏనుగును అక్కడ్నుంచి పంపించేందుకు గట్టిగా అరిచారు. అయినప్పటికీ ఏనుగు కోర్టు గేట్లను తోసి లోపలికి వచ్చింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ ఏనుగు హరిద్వార్‌కు సమీపంలో ఉన్న రాజాజి టైగర్ రిజర్వ్ నుంచి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.