ఎన్నికల ప్రచారానికి మమత దూరం

ఎన్నికల ప్రచారానికి మమత దూరం

కోల్కతా : కరోనా విజృంభిస్తున్నందున పశ్చిమ బెంగాల్ లో ఇకపై ఎన్నికల ప్రచారం నిర్వహించబోనని, మిగతా రాజకీయ నాయకులకూ ఇదే సూచన చేస్తున్నానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇటువంటి నిర్ణయమే తీసుకున్నారు. కోల్కతాలో నిర్వహించబోయే ర్యాలీల్లో పాల్గొనబోరని టీఎంసీ నేత డెరెక్ ఒబ్రియెన్ తెలిపారు. కరోనా విజృంభణ నేపథ్యంలోనే మమత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన ఏప్రిల్ 26న మాత్రమే కోల్కతాలో మమత ముగింపు సమావేశాన్ని నిర్వహిస్తారని చెప్పారు. అలాగే, అంతకుముందు జిల్లాల్లో ఆమె పాల్గొనబోయే అన్ని ఎన్నికల ర్యాలీల సమయాన్ని 30 నిమిషాలకు కుదించారని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos