హాలీవుడ్ నటి కైలీ జెన్నెర్ రికార్డును బద్దలుగొట్టిన గుడ్డు

  • In Film
  • January 14, 2019
  • 220 Views
హాలీవుడ్ నటి కైలీ జెన్నెర్ రికార్డును బద్దలుగొట్టిన గుడ్డు

వాషింగ్టన్: హాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ కైలీ జెన్నర్ గతేడాది ఇన్‌స్టాగ్రామ్‌లో నెలకొల్పిన ప్రపంచ రికార్డును ఓ కోడిగుడ్డు బద్దలుగొట్టింది. ఆశ్చర్యంగా ఉంది కదూ.. నమ్మశక్యం కాకున్నా, నమ్మి తీరాల్సిందే. గతేడాది ఫిబ్రవరిలో కైలీ జెన్నర్ తనకు పుట్టిన పాప ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. శిశువు తన తల్లి చేతి బొటనవేలిని పట్టుకున్నట్టు ఉంది. ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఈ ఫొటోకు 18.1 మిలియన్లకుపైగా లైకులు వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోకు ఇన్ని లైకులు రావడం ఇదే తొలిసారి. దీంతో ఆ ఫొటో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. మరే ఫొటోకు ఇన్ని లైకులు రాలేదు. కైలీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 123 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

తాజాగా, కైలీ రికార్డును ఓ గుడ్డు బద్దలుగొట్టి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. జనవరి 4న ‘ఎగ్ గ్యాంగ్’ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో గోధుమ వర్ణంలో ఉన్న గుడ్డును పోస్టు చేసింది. ఈ గుడ్డు ఫొటోకు ఇప్పటి వరకు 26 మిలియన్ల లైకులు వచ్చాయి. ఫలితంగా నటి కైలీ జెన్నర్ రికార్డు బద్దలైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ఎక్కువ లైకులు సంపాదించుకున్న ఫొటోగా ఈ గుడ్డు ప్రపంచ రికార్డు సృష్టింది. ఇన్‌స్టాగ్రామ్‌ క్వీన్ అయిన కైలీ తన రికార్డు బద్దలు కావడంపై వెరైటీగా స్పందించింది. ఎగ్ గ్యాంగ్ పోస్టు చేసిన గుడ్డులాంటి దానినే నేలపై పగలగొట్టి ప్రతీకారం తీర్చుకుంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోకు కూడా రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 14 మిలియన్ల లైకులు వచ్చాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos