ఈడి స్వాధీనంలో స్వప్న, సందీప్

ఈడి  స్వాధీనంలో స్వప్న, సందీప్

తిరువనంత పురం: యూఏఈ నుంచి బంగారాన్ని మనదేశానికి అక్రమంగా తరలించారనే ఆరోపణలపై స్వప్న సురేష్, సందీప్ నాయర్ లను న్యాయస్థానం ఆగష్టు 1 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఇదే కేసులో ఫైసల్ ఫరీద్, రాబిన్స్ హమీద్లపై కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.వారు ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. నిందితులు దాఖలు చేసిన బెయిల్ వినతిని అడిషనల్ చీప్ జ్యూడిషీయల్ మేజిస్ట్రేట్ తిరస్కరించారు. హంజాద్ అలీ, సంజు, మహమ్మద్ అన్వర్, జిస్పల్, మహ్మద్ అబ్దుల్ షహీమ్ లూ బెయిల్ కోరారు. ఎన్ఐఏ కేసు దర్యాప్తు చేస్తోంది. 30 కిలోల బంగారాన్ని యూఏఈ నుంచి ఇక్కడకు స్మగ్లింగ్ చేసినట్టుగా గుర్తించారు. దీని విలువ రూ. 14.82 కోట్లు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos