ముంబై: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం ఇక్కడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. యెస్ బ్యాంకు నగదు అక్రమ బదిలీ కేసులో అధికారులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. యెస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు అత్యధికంగా రుణాలు తీసుకున్నాయని అధికారులు తెలిపారు. వాస్తవానికి అనిల్ అంబానీ సోమ వారం ఈడీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంది. కానీ గురువారం ఆ పని చేసారు.