కోల్కతా : ఆర్థిక అవకతవకలకు సంబంధించి కోల్కతాలోని ఆర్జి కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నివాసంలో శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు సోదాలు జరిపారు. ఆయనతో పాటు అతని సహాయకులు ముగ్గురు నివాసాల్లో కూడా సోదాలు జరిపినట్లు ఓ అధికారి తెలిపారు.శుక్రవారం ఉదయం 6.15 గంటలకు వేర్వేరు బృందాలు ఈ ప్రాంతాలకు చేరుకున్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. బెలియాఘాటాలోని ఘోష్ నివాసం మరియు హౌరా, సుభాస్గ్రామ్లోని రెండు ప్రదేశాలలో దాడులు జరిపారు. ప్రస్తుతం నలుగురు అధికారులూ సిబిఐ కస్టడీలో ఉన్నారు.గతనెల 23న ఈ కేసును విచారణను సిట్ నుండి సిబిఐకి బదిలీ చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సందీప్ ఘోష్ ప్రిన్సిపల్గా ఉన్న సమయంలో పలు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, వాటిపై విచారణ ఇడి విచారణ చేపట్టాలని కోరుతూ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ డా. అక్తర్ అలీ పిటిషన్ దాఖలు చేశారు.