ఛత్తీస్‌ఘడ్ అధికారుల ఇళ్లపై ఈడీ దాడులు

ఛత్తీస్‌ఘడ్ అధికారుల ఇళ్లపై ఈడీ దాడులు

రాయపూర్ : ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ సన్నిహిత ప్రభుత్వ అధికారులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు చేశారు. సంపాదనకు మించిన అక్రమ ఆస్తులున్నాయనే ఆరోపణలపై ఈ దాడులు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 5 గంటలకు సోదాలు ఆరంభమయ్యాయి. బీజేపేతర ముఖ్యమంత్రులున్న రాష్ట్రాల్లో ఈడీ దాడులను ముమ్మరం చేసింది. సౌమ్యాచౌరాసియా, సీఎ విజయ్ మాలు, రాయగడ్ కలెక్టరు రాను సాహు, అగ్నిచంద్రాకర్, సూర్యకాంత్ తివారి, గనుల శాఖ అధిపతి జేపీ మౌర్యాల ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు చేశారు. రాజకీయనేతలు, వ్యాపారవేత్తల ఇళ్లపై ఈడీ సోదాలు జరుపుతోంది. వికాస్ నిగం ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అగ్ని చంద్రాకర్, లక్ష్మీకాంత్ తివారీ, అజయ్ నాయుడు, సూర్యకాంత్ తివారీ, సన్నీ లునియాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. రాయగడ్ కలెక్టరు రాను షాహు ఇంటిపై 12 మంది ఈడీ అధికారులు వచ్చి సోదాలు జరిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos