వాత పెట్టి వెన్న రాయడమంటే ఇదేనేమో!

వాత పెట్టి వెన్న రాయడమంటే ఇదేనేమో!

సుమారు 50 రోజుల పాటు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా దిగజారిపోయిన ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది.మంగళవారం రాత్రి దేశాన్ని ఉద్దేశించి ప్రసగించిన ప్రధాని నరేంద్రమోదీ రూ.20లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించారు. మోదీ ప్రకటనపై అన్ని పార్టీల నేతలు,ప్రముఖ పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆచితూచి అన్నట్లుగా ఖర్చు చేసే అలవాటున్న మోడీ ప్రభుత్వం.. ఏకంగా రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించటం సంచలనంగా మారింది. అయితే.. తాను చెప్పిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ఏమిటన్న విషయాన్ని దశల వారీగా వెల్లడిస్తామని ఉత్కంఠను మరింత పెంచేశారు. రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ అన్నప్పుడు.. అందుకు అవసరమైన నిధుల్ని కేంద్రం ఎలా సమీకరించిందన్నది ప్రశ్న. దానికి సమాధానం వెతికే క్రమంలో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. ప్రజల మీద బాదేసిన పన్ను మొత్తాన్ని ప్యాకేజీ కింద ప్రకటించారన్న విషయం అర్థమవుతుంది. ముడిచమురు ధరలు పాతాళానికి చేరుకున్నా.. ఫలాలు జాతి జనులకు అందలేదన్న విషయం తెలిసిందే.ఎక్సైజ్ సుంకాన్ని పెంచటం ద్వారా ముక్కుపిండి వసూలు చేస్తున్న మొత్తం.. భారీ ప్యాకేజీ ప్రకటనకు సాయం చేసిందని చెప్పాలి. పెట్రోల్.. డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు.. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా దాదాపు రూ.13లక్షల కోట్ల మొత్తాన్ని కేంద్రం సమీకరించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. మార్కెట్ రుణాల్ని రూ.4.20లక్షల కోట్లు పెంచుకుంది. దీంతో.. దగ్గర దగ్గర రూ.17.2లక్షల కోట్లు సమీకరించింది. దీనికి అదనంగా రూ.2.8లక్షల కోట్లను జోడించటం ద్వారా రూ.20లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటనకు అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos