మనీలా : ఫిలిప్పీన్స్‌లో సోమవారం తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. సెంట్రల్ ఫిలిప్పీన్స్ ప్రాంతం ఈ భూకంపం వల్ల భారీగా నష్టపోయింది. పలు భవనాలు నేలకొరిగాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఇద్దరు మరణించారు. రాజధాని మనీలాకు 60 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూప్రకంపనలతో మనీలాలో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.