కురిచేడు : ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోధనంపాడు గ్రామంలో మంగళవారం రెండు సెకన్లపాటు స్వల్పంగా భూమి కంపించింది. పొదిలి, కొత్తూరు పరిసరాల్లో ఈ భూప్రకంపనలు నమోదైనట్లు ఎర్త్‌క్వేక్ ట్రాకర్ పేర్కొంది. ఆకస్మికంగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇదే తరహా ప్రకంపనలు నిన్న తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ సంభవించాయి. గత డిసెంబర్, ఈ ఏడాది జనవరిలోనూ ఈ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి.