దివాకర్‌ బస్సులకు అనుమతి రద్దు

దివాకర్‌ బస్సులకు అనుమతి రద్దు

అమరావతి: తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, లోక్సభ మాజీ సభ్యుడు జేసి దివాకర్ రెడ్డి సోదరులకు చెందిన ఎనిమిది బస్సుల్ని రవాణా శాఖ అధికారులు గురువారం ఇక్కడ సీజ్ చేసారు. ప్రాంతీయ రవాణా అధికారి సీతారామాంజనేయులు నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. దివాకర్ రెడ్డి సోదరులకు చెందిన ఎనిమిది ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ బస్సుల పర్మిట్లనూ రద్దు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా బస్సులు నడుపటం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేస్తున్నారని రవాణా అధికార్ల వివరించారు. ప్రయాణికుల నుంచీ అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. దరమిలా తనిఖీల్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతోందని ప్రసాదరావు తెలియజేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos