టాలీవుడ్ జక్కన్న రాజమౌళి అత్యంత భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రంపై నెలకొన్న అనుమానాలు,వస్తున్న ఊహాగానాలను దర్శకుడు రాజమౌళి పటాపంచలు చేశారు.

గురువారం తారక్,చరణ్‌లతో కలసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి సంబంధించి అనేక వివరాలు వెల్లడించారు.సుమారు రూ.300 నుంచి రూ.400 కోట్ల భారీ వ్యయంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని అల్లూరు సీతారామరాజు,కొమరంభీమ్ జీవితాలను స్పూర్తిగా తీసుకొని 1920 కాలం నాటి కథతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నారు. రామ్‌చరణ్ అల్లూరి సీతారామారాజు తరహాలో,తారక్ కొమరంభీమ్ తరహాలో కనిపిస్తారని స్పష్టం చేశారు.చిత్రంలో కథ పరంగా ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే కీలకపాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగణ్ నటించనున్నారన్నారు.

ఇక హీరోయిన్లుగా అలియా భట్,లండన్ దేశానికి చెందిన నటి డైసీ ఎడ్గర్ జోన్స్‌లు నటించనున్నారని చరణ్ పక్కన అలియా,తారక్‌కు జోడీగా డైసీలు కనిపించనున్నారన్నారు.

మరో కీలకపాత్రలో దర్శక నటుడు సముద్రఖని కనిపించనున్నారని సముద్రఖని పాత్ర చిత్రానికి వెన్నెముకగా నిలవనుందన్నారు.

తెలుగుతో పాటు తమిళం,హిందీ,కన్నడ,మలయాళం తదితర పది భాషల్లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం విడుదల చేయనున్నామని వచ్చే ఏడాది జులై 30వ తేదీన చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నామని విడుదల తేదీ జాప్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు.మా ఇద్దరి సినీ కెరీర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఒక మైలురాయిగా మిలిగిపోనుందంటూ చరణ్,తారక్‌లు తెలిపారు.రాజమౌళి కథ చెప్పినపుడు ఏమాత్రం ఆలోచించకుండా నాతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి అంగీకరించిన తారక్‌కు హృదయూపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ చరణ్ తెలిపారు.అలాగే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో నాతో కలసి నటిస్తున్న చరణ్‌తో స్నేహం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని తారక్ తెలిపాడు.
