
అమరావతి: ‘రాజకీయాలెంత కంపుకొడుతున్నాయంటే భర్తొక పార్టీ, భార్యొక పార్టీ. మళ్లీ దానికి సమర్థన’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుపై విరుచుకు పడ్డారు. మంగళవారం ఇక్కడి నుంచి తెదేపా కార్యకర్తలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. వైకాపా, భాజపాలది ‘ చాలా చక్కటి, అన్ని విధాల కుదిరిన, అమరిన పొత్తు’ గా అభివర్ణించారు. ‘ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది. స్విచ్ హైదరాబాద్లో ఉంటుంది. కరెంట్ ఢిల్లీ నుంచి వస్తుంది. ఎవరిని మోసం చేస్తారు మీరు. ముగ్గురూ రండి. ఒకేసారి తేల్చుకుందాం. ముసుగులో ……లొద్దని మరోసారి హెచ్చరిస్తున్నా’ అని మండిపడ్డారు.