ఎన్నికల నియమావళి అమలు చర్యలు పూర్తి

ఎన్నికల నియమావళి అమలు చర్యలు పూర్తి

అమరావతి: కట్టుదిట్టంగా ఎన్నికల నియమివళి  అమలు కోసం అన్ని రకాల  ఏర్పాట్లు ముగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది తెలిపారు. గురువారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లా డారు. రాష్ట్ర వ్యాప్తంగా 6600 మెరుపు దాడి బృందాలు, 6160 స్థానిక పహరా బృందాల్ని,  31 అంత రాష్ట్ర , 46  తాత్కాలిక, 18 సంచార తనిఖీ కేంద్రాల్ని  ఏర్పాటు చేసినట్లు వివరించారు. సామాజిక మాధ్య మాలపై  నిఘాకు  రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాల్ని నియమించామన్నారు.అన్ని రకాల  లావా దేవీలపై నిఘా కోసం వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో 161 బృందాలను ఏర్పాటు చేసినట్లు వివ రించారు. గత మూడు రోజులుగా పోలీసులు జరిపిన తనీఖీల్లో రూ. 29.91 కోట్ల నగదు, 13.57 కిలోల బంగారం పట్టుబడిందన్నారు. 70 వాహనాలు, 190 జిలెటిన్‌ స్టిక్స్‌, 50 కిలోల అమ్మోనియం నైట్రేట్‌,50 కిలోల బైండింగ్‌ వైర్‌, 125 కిలోల గంజాయి, 165 స్పోర్ట్స్‌ చేసుకున్నామన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ  తనిఖీలు జరిపి అక్రమంగా నిల్వ ఉంచిన రూ. కోటీ 31 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుందన్నారు.  ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు శుక్ర వారం ముగియ నున్నందున ఆ తర్వాత వచ్చిన దరఖాస్తుల్ని ఎన్నికల అనంతరం పరిశీలించి ఓటర్ల జాబితాలో చేరుస్తామని ఒక ప్రశ్నకు బదులుగా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించబోమని స్పష్టీకరించారు.ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో  చూసుకోవాల్సిన బాధ్యత ఓటర్ల పైనే ఉందన్నారు. అనేక మాధ్యమాల ద్వారా ఓటరు నమోదు, తనిఖీకి పెద్ద ఎత్తున ప్రచారాన్ని సాగించద లచినట్లు చెప్పారు.  ఓటర్ల నమో దులో రాష్ట్రంవెనుకబడి ఉందన్న వాదనలు సరికాదని చెప్పారు. ఓటరు నమోదులో ఇతర అన్ని రాష్ట్రాల తో సమానంగా ఉందన్నారు. 7.9 శాతం వరకూ ఓటర్లు పెరిగి మొత్తం ఓటర్ల సంఖ్య 3.95 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసామ న్నారు. జనవరి 11కు ముందు 20 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చామని తెలిపారు. ఈ నెల 25 తర్వాత మరో 20 లక్షలకు పైగా ఓట్లు పెరిగే వీలుందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos