బెంగళూరు:తనయుడు కుమార స్వామి సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలినందుకు కానీ తాము విచారించడం లేదని దళపతి దేవేగౌడ వ్యాఖ్యానించారు. ‘బల పరీక్షలో ఓటమికి ఫలనా వాళ్లు కారణమని కూడా తాను నిందించ దలచుకో లేదు. మాజీ ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ మంత్రులు సహా ఎవరినీ తప్పు పట్టడం లేదు. కూటమి ముఖ్యమంత్రిగా కుమారస్వామి శక్తి వంచన లేకుండా కష్టపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేశారని’ దేవెగౌడ పేర్కొన్నారు.