కమలం నేత ముంగిట పేడ దిబ్బ

కమలం నేత ముంగిట పేడ దిబ్బ

చంఢిగడ్: కొత్త సాగు చట్టాల రద్దుకు మద్దతు ఇవ్వనందుకు నిరసనగా హోషియార్పూర్లో పంజాబ్ మాజీ మంత్రి, భాజపా నేత తీక్షణ్ సూద్ ఇంటి ముందు ఎదుట కొందరు ఆందోళనకారులు శుక్రవారం రాత్రి ట్రాక్టర్ ట్రాలీతో పేడ తరలించి కుప్పగాపోసారు. తమ ఆందోళనలో ఇదొక భాగమని తెలిపారు. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దని హింసాత్మక, రెచ్చగొట్టే ఘటనలకు పాల్పడవద్దని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పిలుపునిచ్చిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. రైతులు శాంతియుతంగా తమ నిరసన కార్యక్రమాలు చేసుకోవాలని సూచించారు. ‘రోజుల తరబడి ఆందోళన నిర్వహిస్తుండటంతో కొందరు సహనాన్ని కోల్పోతున్నారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడతున్నారు. అలా చేస్తే పంజాబ్లో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. రైతులు తమ పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగించాల’ని అమరీందర్ సింగ్ హితవు పలికారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos