తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలిచే పాకిస్థాన్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ తాజాగా మరో వివాదంతో వార్తల్లో నిలిచాడు.తన నగ్నచిత్రాలు బయట పెడతానని బెదిరిస్తున్నాడంటూ దుబాయ్కు చెందిన అష్రినా సాఫియా అనే మహిళ ఆరోపించింది.తమ మధ్య ఉన్న సంబంధం ప్రపంచానికి తెలియడంతో ఆ వార్తలను ఖండించాలని షాదాబ్ తనపై ఒత్తిడి తెస్తున్నాడని, లేకుంటే నగ్న చిత్రాలు బయట పెడ్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్లో తన గోడు వెళ్లబోసుకుంది.2019లో షాదాబ్తో పరిచయమైందని, ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ ప్రపంచకప్ సందర్భంగా తమ బంధం మరింత బలపడిందని పేర్కొంది. దాంతో తామిద్దరం చెట్టాపట్టాలేసుకొని చాలా దేశాలు తిరిగామని చెప్పుకొచ్చింది. వివిధ దేశాల్లో షాదాబ్ పాల్గొన్న క్రికెట్ టోర్నీలకు తన సొంత డబ్బులు ఖర్చుపెట్టుకొని వెళ్లానని కూడా పేర్కొంది.ఈ క్రమంలో తాము సాన్నిహిత్యంగా ఉన్న సందర్భంలో ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్ ఫోటో తీసాడని, అది కాస్త వైరల్ అవ్వడంతో తమ రిలేషన్ గురించి ప్రపంచానికి తెలిసిందని సాఫియా తెలిపింది. అయితే ఈ వార్తలను ఖండించాలని, తాను కేవలం అభిమానిని మాత్రమేనని మీడియాకు చెప్పాలని షాదాబ్ తనపై ఒత్తిడి చేస్తున్నాడని ఆ సుదీర్ఘ పోస్ట్లో ఆరోపించింది. లేకుంటే తన నగ్నచిత్రాలు, బయట పెడ్తానని బెదిరిస్తున్నాడని చెప్పుకొచ్చింది. తనతో షాదాబ్ చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్, బెదిరింపు మెసేజ్లను కూడా సాఫియా తన సోషల్ మీడియా ఖాతాల్లో బహిర్గతం చేసింది.ఇక పాకిస్థాన్ క్రికెటర్లపై ఈ తరహా ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇమామ్ ఉల్ హక్, షాహీన్ షా అఫ్రీది కూడా ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్నారు. పలువురి మహిళలతో ఇమామ్ అసభ్యంగా చాట్ చేసిన వాట్సాప్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షాహీన్ షా అప్రీదీ వీడియోకాల్లో ఓ మహిళలను ఎక్స్ పోజింగ్ చేయమన్నట్లుఆరోపణలు ఎదుర్కొన్నాడు.