రూ.271 కోట్లతో ప్రధాని భార్య పరార్

రూ.271 కోట్లతో ప్రధాని భార్య పరార్

దుబాయ్‌ : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రధాని, అపర కుబేరుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ రషీద్‌ ఆల్‌ మత్కవుమ్‌ ఆరో భార్య హయా బింట్‌ ఆల్‌ హుస్సేన్‌ తన పిల్లలతో కలసి దేశం నుంచి పారిపోయారు. సుమారు 271 కోట్ల నదగుతో ఆమె ఉడాయించారు. పిల్లలు జలీల (11), జయేద్‌ (7)లతో కలసి ఆమె వెళ్లిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. వివాహ బంధం విచ్ఛిన్నం కావడంతో ఆమె భర్తతో కలసి ఉండలేకపోయారని సమాచారం. లండన్‌లో ఆమె ఆశ్రయం పొంది ఉంటారని భావిస్తున్నారు. ఆమెకు ఆశ్రయం ఇవ్వడానికి జర్మనీ నిరాకరించడంతో లండన్‌లోని రహస్య ప్రాంతంలో తల దాచుకుంటున్నట్లు తెలిసింది. రషీద్‌ కుమార్తె షేక్‌ లతిఫా కూడా గత ఏడాది దుబాయ్‌ నుంచి  పారిపోవడానికి ప్రయత్నించారు. తనను వదిలిపెట్టి భార్య వెళ్లిపోవడంపై రషీద్‌ ఆగ్రహంగా స్పందించారు. తన నమ్మకాన్ని వమ్ము చేసిందని, మోసానికి పాల్పడిందని తిట్టిపోశారు. ఆమె బతికున్నా, చనిపోయినా తనకు అనవసరమని పేర్కొన్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos