న్యూ ఢిల్లీ: సామాన్యుడిపై ఔషధాల ధరల పెరుగుదల పిడుగు పడనుంది. జ్వరం, ఇన్ఫెక్షన్లు, బీపీ, గుండె, చర్మ వ్యాధులు, అనీమియా తదితరాలకు వాడే అత్యవసర ఔషధాల ధరలు వచ్చే నెల నుంచి 10.8శాతం పెరగనున్నాయని జాతీయ ఔషధాల ధరల సంస్థ ప్రకటించింది. అత్యవసర ఔషధాల జాబితాలో 800 మందులున్నాయి.