హైదరాబాద్‌లో శరణార్థుల డ్రగ్స్ దందా

  • In Crime
  • January 12, 2019
  • 226 Views
హైదరాబాద్‌లో శరణార్థుల డ్రగ్స్ దందా

డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్ద రు మయన్మార్ శరణార్థులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. మయన్మార్ దేశానికి చెం దిన అబిబస్ రహమాన్, మహ్మద్ రహీమ్ శరణార్థులుగా 2016లో హైదరాబాద్ వచ్చి బాలాపూర్ ప్రాంతంలో ఉంటున్నారు. అబిబస్ సెంట్రింగ్ పని చేస్తుండగా, రహీమ్ హోటల్‌లో పనిచేసేవాడు. మయన్మార్‌కు చెందిన సలీం నుంచి వారం క్రితం డ్రగ్స్ కొని నగరానికి తెచ్చారు. ఒక్కోప్యాకెట్లో 190 డ్రగ్స్‌ట్యాబ్లెట్లు ఉండగా, ఏడు ప్యాకెట్లను రూ.66,500కు కొన్నారు. ఈ ట్యాబ్లెట్లను వై, యాబా అనే పేర్లతో పిలుస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందడంతో బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ వై సైదులు తనిఖీలు ముమ్మరం చేశారు. బాలాపూర్ ఫాతిమ మసీద్ సమీపంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరిని ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. వీరి జేబుల్లో సోదా చేయ గా డ్రగ్స్ ప్యాకెట్లు లభించాయి. వారిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు ఏడు ప్యాకెట్ల డ్రగ్స్ ట్యాబ్లెట్లు, రెండు మొబైల్స్, రహీమ్ పేరిట ఉన్న ఆధార్ కార్డు, రూ.26 వేల నగదు స్వాధీనం చేసుకొన్నారు. స్వాధీనం చేసుకొన్న డ్రగ్స్‌ను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. మయాన్మార్‌కు దొడ్డిదారిన వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి తిరిగి అదే రూట్లో వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఓ నిందితుడి వద్ద లభించిన ఆధార్‌కార్డు ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మీడియా సమావేశంలో జాయింట్ కమిషనర్ గొట్టె సుధీర్‌బాబు, వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos