మళ్లీ వివాదంలో డీఆర్ఎస్

మళ్లీ వివాదంలో డీఆర్ఎస్

క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు బలి
కాకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్‌ఎస్‌) తరచూ వివాదాలకు
లోనవుతోంది. తాజాగా ఫీల్డ్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌ చేసిన తప్పు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
డర్బన్‌ వేదికగా ప్రారంభమైన టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విశ్వ పెర్నాండో తన బౌలింగ్‌లో
హషీమ్‌ ఆమ్లాకు ఎల్‌బీడబ్ల్యు అప్పీల్‌ చేశాడు. అలీమ్‌ ద్వారా అప్పీలును తిరస్కరించడంతో
ఇతర ఆటగాళ్లతో చర్చించాక కెప్టెన్‌ దిముత్‌ కరుణ రత్నే డీఆర్‌ఎస్‌ను కోరాడు. అయితే
నిర్ణీత 15 సెకంట్ల గడువు ముగిసిపోయినందున, ఆ అభ్యర్థనను అలీమ్‌ దార్‌ తిరస్కరించాడు.
వాస్తవానికి అప్పటికి 15 సెకండ్ల సమయం మించలేదు. పైగా పది సెకండ్లు ముగియగానే ఫీల్డ్‌
అంపైర్‌ డీఆర్‌ఎస్‌ కోసం యోచిస్తున్న జట్టునో లేదా బ్యాట్స్‌మన్‌నో అప్రమత్తం చేయాల్సి
ఉంటుంది. దీనినేమీ పట్టించుకోకుండానే అలీమ్‌ ద్వారా ఒంటెత్తు పోకడకు పోయాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos