భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ వద్ద డ్రైవర్లు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు డ్రైవర్లు. దాదాపు 3లక్షల మంది డ్రైవర్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని రోడ్డెక్కారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీని చుట్టు ముట్టారు. 30 జిల్లాల నుంచి దాదాపు 3 లక్షల మంది రాజధానిలో డిమాండ్లను నెరవేర్చాలని నిరసన చేపట్టారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగనప్పటికీ దీన్ని పూర్తిగా నిఘా వైఫల్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని ప్రభుత్వం గంభీరంగా తీసున్నట్లు తెలుస్తోంది. వాటిల్లో 55ఏళ్ల పైబడినవారికి ఫించను, 30 కిమీకు ఓ శౌచాలయం, రోడ్డు భద్రత, డ్రైవర్లు చనిపోతే రూ.2 లక్షల బీమా, ప్రమాదంలో చనిపోతే రూ.5లక్షలు, వారి పిల్లలకు ఉచిత విద్య, ఇందిరా ఆవాస్ యోజన వంటి వాటిని తమకు కల్పించాలని డిమాండ్ చేశారు.