ప్రయాణికురాలితో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన

  • In Crime
  • March 2, 2019
  • 147 Views
ప్రయాణికురాలితో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన

విజయవాడ : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు డ్రైవర్‌ నుంచే అసభ్య ప్రవర్తన ఎదురైంది. లక్ష్మీ శిరీష అనే మహిళ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ వెళ్లడానికి అన్నవరం వద్ద బస్సు ఎక్కింది. విశాఖపట్నం నుంచి ఆ  బస్సు వస్తోంది. శిరీష తన బెర్తులో నిద్రిస్తున్న సమయంలో బస్సు రెండో డ్రైవర్‌ గురుమూర్తి అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె తన భర్తకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. అతని సలహా మేరకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద బస్సును ఆపి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పటమటలంక పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos