డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ 500 మందికి జైలు శిక్ష..

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ 500 మందికి జైలు శిక్ష..

ఏం చేసినా కుక్క తోక వంకరే అన్న చందాన పోలీసులు,ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా,శిక్షలు కఠినతరం చేసినా మద్యం తాగితే పోతారంటూ థియేటర్లలో,టీవీల్లో చూపించినా పలు స్వచ్ఛంద సేవా సంఘాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. చిన్న, పెద్ద,పేద,ధనిక అనే బేధభావాలు లేకుండా మందుకొట్టి రోడ్లపైకి వచ్చే విషయంలో హైదరాబాద్‌ నగరంలోని మందుబాబులు ఐకతమ్యం పాటిస్తున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడుతున్న మందుబాబుల సంఖ్యలో రోజురోజుకు పెరుగుతూనే ఉంది.మార్చ్‌నెలలో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 1,956 కేసులు నమోదు కాగా 500 మంది మందుబాబులు అడ్డంగా దొరికిపోయి జైళ్లకు వెళ్లారు.ఈ మొత్తం కేసుల్లో 18-30 ఏళ్ల వయసుకున్న వ్యక్తులు 885 మంది కాగా 31-40 మధ్య వయసున్న వ్యక్తులు 729 మంది,41-50 ఏళ్ల వయసున్న వ్యక్తులు 254 మంది,51 ఏళ్ల పైబడ్డ వ్యక్తులు 87 మంది,ఒక మైనర్‌ బాలుడు ఉన్నారు.పట్టబడ్డ వ్యక్తులను కోర్టులో ప్రవేశపెట్టగా అందులో 460 మందికి ఒకటి నుంచి ఐదు రోజుల జైలు శిక్ష,40 మంది ఆరు నుంచి 25 రోజుల జైలు శిక్ష విధించింది.

.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos