చెన్నై : తమిళనాడులో ఓటరు జాబితాను తెలుగులోనూ ముద్రించాలని ద్రావిడదేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. కృష్ణగిరి, కోయం బ త్తూ రు, సేలం, విరుదునగర్, తిరుచ్చి, మదురై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, చెన్నై జిల్లాల్లో తమిళులకు సమానంగా తెలుగు, కన్నడం, మలయాళం, ఉర్దూ, హిందీ మాట్లా డే ప్రజలు నివశిస్తున్నారు. 1993లో ప్రభుత్వం జారీ చేసిన జిఒ 83 ప్రకారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో 15 శాతానికి పైగా తమిళేతరులు నివశిస్తున్నారు. ఆ ప్రజలు ఏ భాషలో ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తే, ప్రభుత్వం వారు ప్రత్యుత్తరాలు కూడా ఆ భాషలోనే ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ఈ ఆదేశాలు సరిగ్గా అమలు కావడం లేదు. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ద్రావిడ దేశం చేసిన వినతికి స్పందించిన ఇసి తిరుత్తణి, హోసూరు నియోజకవర్గాల్లో ఓటరు జాబితా తెలుగులో ఇచ్చింది. నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమిళేతర ప్రజలు అధికంగా వుండే ప్రాంతాల్లో తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం, ఉర్దూ, హిందీ భాషల్లో ఓటరు జాబితా అందించాల’ని కోరారు.