ముంబై: కరోనా రెండో దాడిని బ్యాకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పిలుపు నిచ్చారు. లక్ష్య సాధనకు అవసరమైన అన్ని వర్గాలను ఆదుకునేందుకు సహకరిస్తామని భరోస ఇచ్చారు. బుధ వారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘ ఏడాది పాటూ, ద్రవ్యోల్బణాన్ని స్థానిక లాక్ డౌన్ లు, కరోనా వ్యాప్తి ప్రభావితం చేయనున్నాయి. పరిస్థితిని నియంత్రణకు అన్ని ప్రభుత్వ వర్గాలూ కృషి చేయాలి. ఇండియాలో రోగుల సంఖ్య 2 కోట్లు దాటి నందున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోనున్నాం. గత మార్చికి దాదాపుగా పూర్తి నియంత్రణలోకి వచ్చిన కరోనా ఆపై ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించింది. నియంత్రణ చర్యలు కనిపించలేదు. కరోనాను పారద్రోలేందుకు చర్యలు తీసుకోవాలి. ఇందుకు మా వద్ద ఉన్న అన్ని వనరులనూ వినియోగిస్తాం. నిన్న మొన్నటి వరకూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉన్నపుడు భారత్ బలంగా ఉంది. , ఇప్పుడు భారత్ పరిస్థితి మారిపోయింద’న్నారు.