అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మాట మీద నిలబడే అలవాటు లేదని మరోసారి రుజువైంది.కవ్మీర్ అంశంలో ఇక మధ్యవర్తిత్వం చేసుకునేది లేదంటూ ప్రకటించి నెల రోజులు కూడా గడవక ముందే మరోసారి కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమంటూ జిహ్వ చంచాల్యాని బయట పెట్టుకున్నాడు. భారత్ లో అంతర్భాగమైన కశ్మీర్ అంశంలో భారత్ కు ఆఫర్ ఇస్తున్నానంటూ జోక్యం చేసుకోవడం దుమారం రేపింది.భారత్ కు కశ్మీర్ అంశంలో సాయం చేస్తామని.. ఆ ఆఫర్ ఏంటో భారత్ కు తెలుసు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.కశ్మీర్ అంశంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని భారత్ పలుమార్లు స్పష్టం చేయడంతో ఇకపై కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోమంటూ ప్రకటించిన కొద్ది రోజులకే మరోసారి కశ్మీర్ అంశంపై మాట్లాడి కుక్క తోక వంకర సామెత తనకు సరిపోతుందని ట్రంప్ నిరూపించుకున్నాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..