వాషింగ్టన్: ‘నేను శాంతి కాముకుడిని. నాకు యుద్ధం అంటే ఇష్టం లేద’ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం విలేఖరులతో అన్నారు. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతు దారులు మంగళవారం బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి పాల్పడిన నేపథ్యంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ‘ఇరాన్లోని పరిస్థితిని చాలా బాగా చక్కదిద్దాం. యుద్ధం చేయాలన్న ఆలోచన ఇరాన్కు మంచిది కాదు. నేను శాంతిని కోరుకుంటున్నాను. యుద్ధం రావాలని అనుకోవడం లేద’ని ట్రంప్ విలేఖరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘బాగ్దాద్లోమా రాయబార కార్యాలయంపై దాడికి ఇరాన్దే పూర్తి బాధ్యత. దీనికి ఇరాన్ భారీగా మూల్యం చెల్లించుకుంటుంద’ని అంతకుముందు ట్రంప్ హెచ్చరించారు. ‘ఇది హెచ్చరిక కాదు, ఇది ముప్పు’ అని ట్వీట్ చేశారు. ‘మా కార్యాల యంపై దాడిని భద్రత బలగాలు సమర్థవంతంగా తిప్పి కొట్టాయి. సిబ్బంది సురకక్షితంగా ఉన్నారు. మా విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఇరాక్ ప్రధాని, అధ్యక్షుడికి ధన్యవాదాలు’ అన్నారు.