ముంబై:అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటివల పలు దేశాలపై సుంకాల విధింపు నిర్ణయాల కారణంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం ఆందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో 2025 ఫిబ్రవరి 3న భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే 87.29కి పతనమైంది. ఈ క్రమంలో అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది. ట్రంప్ అధిక సుంకాల విధింపులు, అమెరికా డాలర్‌కు ఉన్న అధిక డిమాండ్ వల్ల ఇది జరిగిందని ఆర్థిక నిపుణులు చెప్పారు.